Share News

సాల్ట్‌లేక్ స్టేడియంలోని వివాదాస్పద ఫుట్‌బాల్ శిల్పం కూల్చివేత

ABN , Publish Date - May 23 , 2026 | 06:11 PM

కోల్‌కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్డేడియం వీవీఐపీ గేటు వెలుపలనున్న వివాదాస్పద ఫుట్‌బాల్ శిల్పాన్ని శనివారం ఉదయం కూల్చివేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్‌బాల్ శిల్పం కూల్చివేత జరిగినట్టు అధికారులు తెలిపారు.

సాల్ట్‌లేక్ స్టేడియంలోని వివాదాస్పద ఫుట్‌బాల్ శిల్పం కూల్చివేత
salt lake stadium sculpture demolished

కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్డేడియం వీవీఐపీ గేటు వెలుపలనున్న వివాదాస్పద ఫుట్‌బాల్ శిల్పాన్ని శనివారం ఉదయం కూల్చివేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్‌బాల్ శిల్పం కూల్చివేత జరిగినట్టు అధికారులు తెలిపారు.


సాల్ట్ లేక్‌లోని వివేకానంద యుబ భారతి క్రీరాంగణ్‌ (Vivenkananda Yuba Bharati Krirangan)గా పేరున్న ఈ స్టేడియం పునరుద్ధరణ కార్యక్రమం 2017లో జరిగింది. ఆ సమయంలో ఫుట్‌బాల్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. నాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యవేక్షణలో ఈ శిల్పం ఏర్పాటైంది. నడుము వరకూ ఉన్న కాళ్లు, దానిపై ఫుట్‌బాల్, బిశ్వబంగ్లా లోగోతో ఈ శిల్పం నిర్మించారు. అయితే ఈ నిర్మాణం కళాత్మకంగా లేదని, అసహ్యకరమైన ఆకృతిలో అర్ధరహితంగా ఉందనే విమర్శలు రావడంతో దానిని తెలగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి నితీష్ ప్రమాణిక్ ఇటీవల ప్రకటించారు. ఆయన మే 17న స్టేడియంలో జరిగిన 'మోహన్ బగాన్ ఈస్ట్ బెంగాల్ డెర్బీ'కి హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ శిల్పం రూపకల్పనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ శిల్పం పెట్టినప్పటి నుంచి గత పాలకుల పరిస్థితి తిరగబడిందని చాలామంది అభిప్రాయపడినట్టు చెప్పారు.


కాగా, ప్రజాపనుల శాఖ సీనియర్ అధికారులతో సంప్రదింపుల తర్వాతే ఫుట్‌బాల్ శిల్పాన్ని తొలగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు క్రీడాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు సాల్ట్ లేక్ స్టేడియంతో విడదీయరాదని అనుబంధం ఉందన్నారు. సౌందర్యం, సాంస్కృతిక ప్రాధాన్యలు మేళవించి ఫుట్‌బాల్ క్రీడకు చెందిన ల్యాండ్‌మార్క్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. పాత శిల్పం స్థానే ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుని విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. పశ్చిమబెంగాల్ ఫుట్‌బాల్ వారసత్వం, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచే సింబల్‌ను తామంతా కోరుకుంటున్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ

మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్‌ సావోకు బెదిరింపులు

Updated Date - May 23 , 2026 | 06:20 PM