Share News

100కు పైగా సీట్లతో కేరళలో గెలుపు మాదే: కాంగ్రెస్

ABN , Publish Date - Mar 22 , 2026 | 07:22 PM

అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బి-టీమ్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

100కు పైగా సీట్లతో కేరళలో గెలుపు మాదే: కాంగ్రెస్
KC Venugopal and Rahul Gandhi

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ (Kerala) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బి-టీమ్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏజెన్సీల నుంచి ఉపశమనం పొందిన విజయన్‌ ఎలా రాహుల్‌ను ప్రశ్నిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ప్రశ్నించారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ కార్పొరేట్ ప్రయోజనాలపై నిరంతరం పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీస్తూనే ఉన్నారని చెప్పారు. బీజేపీకి, ఎల్‌డీఎఫ్ సారథ్యంలోని కమ్యూనిస్టు పార్టీకి మధ్య అవగాహన ఉండే అవకాశం ఉందన్నారు. ఇందువల్లే పినరయి విజయన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.


'కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు అనుకూలంగా గాలులు వీస్తున్నారు. పదేళ్లుగా ఎల్‌డీఎఫ్‌కు అధికారం ఇచ్చినది చాలని ప్రజలు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో యూడీఎఫ్ 100కు పైగా సీట్లలో గెలుస్తుంది' అని వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.


నరేంద్ర మోదీ వైఫల్యాలను ప్రతిక్షణం రాహుల్ గాంధీ ఎండగడుతున్నారని, ఆ విషయం దేశ ప్రజలందరీ తెలుసునని వేణుగోపాల్ అన్నారు. అలాంటి రాహుల్‌పై పినరయి ఆరోపణలు ఆయన దయనీయ పరిస్థితిని చాటుతున్నాయని ఆక్షేపణ తెలిపారు. యూడీపీ గెలుపు తథ్యమని తెలియడం వల్లే సీఎం ఆరోపణలకు దిగుతున్నారని అన్నారు. 140 మంది సభ్యుల కేరళ అసెంబ్లీకి ఒకే విడతలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

డీఎంకేకు షాక్.. కూటమి నుంచి వైదొలిగిన తమిళగ వాళ్వూరియా కట్చి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మంత్రులతో మోదీ కీలక భేటీ

Updated Date - Mar 22 , 2026 | 07:28 PM