డీఎంకేకు షాక్.. కూటమి నుంచి వైదొలిగిన తమిళగ వాళ్వూరియా కట్చి
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:09 PM
డీఎంకేకు ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన తమిళగ వాళ్వూరియా కట్చి షాక్ ఇచ్చింది. డీఎంకే సారథ్యంలోని అధికార సెక్యులర్ అలయెన్స్ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు టి.వేలుమురగన్ ఆదివారంనాడు తెలిపారు.
చెన్నై: డీఎంకేకు ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన తమిళగ వాళ్వూరియా కట్చి (TVK) షాక్ ఇచ్చింది. డీఎంకే సారథ్యంలోని అధికార సెక్యులర్ అలయెన్స్ (SPA) నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు టి.వేలుమురగన్ (T Velumurugan) ఆదివారంనాడు తెలిపారు. కడలూరు జిల్లా పన్రుటి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేగా వేలుమరుగన్ ఉన్నారు.
డీఎంకే పెద్దన్న వైఖరిపై వేలుమురుగన్ అంసతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీని నిర్ల్యం చేస్తోందని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌పై చర్చల్లో ఒక సీటు కేటాయిస్తామని డీఎంకే చెప్పింది. సామాజిక న్యాయంతో సహా పలు డిమాండ్లు ఆ పార్టీ దృష్టికి తెచ్చాం. ఇతర పార్టీలు ఎలాంటి డిమాండ్లు చేయనప్పుడు మీరెందుకు చేస్తున్నారని మమ్మల్ని అడిగింది. కనీసం కొన్ని డిమాండ్లనయినా అంగీకరించాలని పదేపదే ప్రభుత్వాన్ని అడిగాను. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది' అని వేలుమురుగన్ తెలిపారు.
తదుపరి కార్యాచరణపై అడిగినప్పుడు తమిళనాడులోని ఎన్డీయేలో మాత్రం చేరేది లేదని వేలుమురుగన్ చెప్పారు. పొత్తులపై ఇతర పార్టీలతో మాట్లాడుతున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మంత్రులతో మోదీ కీలక భేటీ
జేడీయూకు గుడ్‌బై.. ఆర్ఎల్డీలో చేరిన కేసీ త్యాగి