Share News

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మంత్రులతో మోదీ కీలక భేటీ

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:44 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా కీలక రంగాలైన పెట్రోలియం, విద్యుత్, ఎరువుల పరిస్థితిపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మంత్రులతో మోదీ కీలక భేటీ
PM Modi key meeting with senior Ministers

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా కీలక రంగాలైన పెట్రోలియం, విద్యుత్, ఎరువుల పరిస్థితిపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఈ సమీక్షా సమీవేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నాయి.


దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధనం సరఫరా జరగడం, సరకుల రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడటంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు. వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలకు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆ వర్గాలు వెల్లడించాయి.


పశ్చిమాసియాలో ఘర్షణలతో ఇంధన సంక్షోభ తలెత్తిందని ప్రధాని మోదీ ఈనెల 12న పేర్కొన్నారు. ఇది భారత్‌కు కీలక పరీక్షగా మారినందున, పరిస్థితులను ఓర్పు, ప్రజాచైతన్యంలో ఎదుర్కోవాలని అభిప్రాయపడ్డారు. ఇంతర్జాతీయ సరఫరా గెలుసులో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ప్రస్తుత పరిస్థితిపై ఇజ్రాయెల్, ఇరాన్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్, మలేసియా నాయకులతో మోదీ సంప్రదింపులు సాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా..

జేడీయూకు గుడ్‌బై.. ఆర్ఎల్డీలో చేరిన కేసీ త్యాగి

Updated Date - Mar 22 , 2026 | 05:56 PM