Share News

ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా..

ABN , Publish Date - Mar 22 , 2026 | 02:30 PM

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఎలాంటి విరామమూ లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా (గుజరాత్ సీఎం పదవీకాలం సహా) పని చేసిన వ్యక్తిగా నిలిచారు.

ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా..
Narendra Modi record

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఎలాంటి విరామమూ లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా (గుజరాత్ సీఎం పదవీకాలం సహా) పని చేసిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కీం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ (8,930 రోజులు) పేరిట ఉంది. తాజాగా ఆయన రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. పవన్ కుమార్ 8,930 రోజుల పాటు సిక్కీం సీఎం హోదాలో ఉన్నారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలతో అన్ని రోజుల పదవీకాలాన్ని పూర్తి చేశారు (Narendra Modi record).


2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. అంతేకాదు గుజరాత్‌కు అత్యధిక కాలం సీఎంగా ఉన్న రికార్డు కూడా మోదీ పేరిటే ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా మోదీనే కావడం గమనార్హం. ఇక, ప్రధాని పదవిలో కొనసాగుతూ కూడా మోదీ పలు రికార్డులను నెలకొల్పారు (Modi tenure 8931 days).


స్వాతంత్య్రానంతరం జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోదీ నిలిచారు (Modi milestone). అలాగే కేంద్రంలో రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా రికార్డు నెలకొల్పారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోదీ నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హామీల అమలుకే నిధులు లేవు.. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడివి?: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Updated Date - Mar 22 , 2026 | 02:35 PM