Share News

ప్రోటోకాల్ వివాదం.. రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై కాంగ్రెస్ ఫైర్

ABN , Publish Date - Jan 26 , 2026 | 09:49 PM

రిపబ్లిక్ వేడుకల్లో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. వారికి మూడో వరుసలో సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా కేంద్రంపై విమర్శలు కురిపించారు.

ప్రోటోకాల్ వివాదం.. రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై కాంగ్రెస్ ఫైర్
Rahul gandhi

న్యూఢిల్లీ: కర్తవ్యపథ్‌లో సోమవారంనాడు నిర్వహించిన 77వ రిపబ్లిక్ వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదంటూ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రోటోకాల్ ప్రకారం లోక్‌సభలో విపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉండగా, రాహుల్‌కు మూడో వరుసలో సీటు కేటాయించడాన్ని తప్పుపట్టింది. తమ వాదనకు బలం చేకూరుస్తూ 2014లో సీట్ షేరింగ్ ఫోటోను కూడా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేసింది.


రిపబ్లిక్ వేడుకల్లో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. వారికి మూడో వరుసలో సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా కేంద్రంపై విమర్శలు కురిపించారు. 'దేశ విపక్ష నేత విషయంలో అనుసరించాల్సిన సంప్రదాయం, ప్రొటోకాల్ ఇదేనా? ప్రభుత్వం ఆత్మన్యూనతలో కూరుకుపోయంది. ప్రభుత్వ అసహనాన్నే ఈ చర్య చాటుతోంది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.


రాహుల్ గాంధీని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠూగూర్ ఆరోపించారు. 2014లోని ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. 'ఎల్‌కే అడ్వాణీ ఎక్కడ కూర్చున్నారో చూడండి. అప్పుడు లేని గందరగోళం ఇప్పుడు ప్రోటోకాల్ విషయంలో ఎందుకు సృష్టిస్తున్నారు? ఖర్గే, రాహుల్‌ను అవమానించాలన్నదే మోదీ, షాల ఉద్దేశం' అని అన్నారు. 2014లో ఎల్‌కే అడ్వాణి అటు రాజ్యసభలో కానీ, ఇటు లోక్‌సభలో విపక్ష నేతగా లేరు. అయినప్పటికీ రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీతో కలిసి ఆయనకు ముందు వరుసలో సీటు కల్పించారు. అప్పట్లో సుష్మాస్వారాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర అధికారికంగా ఇంకా స్పందించలేదు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్‌నకు ఝలక్... భారత్ టూర్‌కు కెనడా ప్రధాని

కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 09:52 PM