Share News

కమర్షియల్‌ గ్యాస్‌ కోటా పెంపు

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:43 AM

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ ఇంధనం కోటాను పెంచింది. మూడు వారాల కిందట గల్ఫ్‌ యుద్ధం ముందున్న సరఫరాలో 50ు మేరకు ఈ నెల 23 కల్లా పునరుద్ధరిస్తున్నట్లు...

కమర్షియల్‌ గ్యాస్‌ కోటా పెంపు

యుద్ధం ముందు పరిస్థితిలో 50% పునరుద్ధరణ

హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు ప్రాధాన్యం

అదీ పైప్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌కు దరఖాస్తు చేసుకుంటేనే

కమర్షియల్‌ గ్యాస్‌ కోటా పెంపు

న్యూఢిల్లీ, మార్చి 21: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ ఇంధనం కోటాను పెంచింది. మూడు వారాల కిందట గల్ఫ్‌ యుద్ధం ముందున్న సరఫరాలో 50ు మేరకు ఈ నెల 23 కల్లా పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 30ు దాకా పునరుద్ధరించారు. మరో 20 శాతాన్ని రెండ్రోజుల్లో పునరుద్ధరిస్తారు. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ప్రజా సంక్షేమం, ఆహార సరఫరాతో సంబంధం ఉన్న రంగాలకు ఈ పెంచిన కోటాను కేటాయిస్తారు. రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పరిశ్రమల క్యాంటీన్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, డెయిరీలు, కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ సబ్సిడీ క్యాంటీన్లు, ఐదు కిలోల సిలిండర్లు వాడే వలస కూలీలు ప్రాధాన్య వర్గాలుగా ఈ పెంచిన 20ు కోటాను అందుకుంటారు. ఈ రంగాల్లో ఉన్నంత మాత్రాన ఆటోమాటిక్‌గా సిలిండర్‌ రాదని, తప్పనిసరిగా చమురు సంస్థల దగ్గర తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్లు అవసరం అనుకున్న వినియోగదారులంతా పైపుడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కనెక్షన్‌ కోసం చమురు సంస్థల దగ్గర దరఖాస్తు చేసుకోవాలని, అలా చేసుకుంటేనే పెంచిన కోటాలో వాణిజ్య గ్యాస్‌ అందిస్తామని కేంద్రం తేల్చిచెప్పింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 06:43 AM