Share News

‘బిస్లెరీ’ నీటిలో కోలిఫామ్‌

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:39 AM

ప్రముఖ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బ్రాండ్‌ బిస్లెరీ ఇంటర్నేషనల్‌కు ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) మరోసారి షాక్‌ ఇచ్చింది.

‘బిస్లెరీ’ నీటిలో కోలిఫామ్‌
bisleriwater

  • బెంగాల్‌లో సేకరించిన నీటి నమూనాల్లో బ్యాక్టీరియా

  • విచారణకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ అనుమతి

న్యూఢిల్లీ, నవంబరు 27: ప్రముఖ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బ్రాండ్‌ బిస్లెరీ ఇంటర్నేషనల్‌కు ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) మరోసారి షాక్‌ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ బిస్లరీ ప్లాంట్‌ నుంచి సేకరించిన నమూనాల్లో హానికరమైన కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ పరీక్షల్లో తేలడంతో ఆ సంస్థపై విచారణకుఅనుమతినిచ్చింది. జల్‌పాయ్‌గురి ప్రాంతం టెలిపారా గ్రామంలోని ప్లాంట్‌ నుంచి నమూనాలు సేకరించినట్లు వెల్లడించింది. కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉండటం వల్ల తాగడానికి ఆ నీరు సురక్షితం కాదని ఆ వర్గాలు తెలిపాయి. ఆ కలుషిత నీరు ఉన్న నిర్దిష్ట బ్యాచ్‌ విక్రయాలను నిషేధించినట్లు పేర్కొన్నాయి. ఇటీవల గోవాలోని బిస్లెరీ ప్లాంట్‌లో సేకరించిన నమూనాల్లోనూ పరిమితికి మించి బ్రోమైట్‌ ఉన్నట్లు తేలడంతో ఆ నీరు సురక్షితం కాదని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్యాకేజ్డ్‌ వాటర్‌ బాటిళ్లలోని నీరు సురక్షితమేనని,ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ల్యాబ్‌లపరీక్షల్లోనే లోపాలున్నట్లు ఇదివరకే బిస్లెరీ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 03:42 AM