యూపీ మంత్రివర్గ విస్తరణ... గవర్నర్‌ను కలవనున్న యోగి ఆదిత్యనాథ్
ABN , Publish Date - May 09 , 2026 | 05:41 PM
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరుగనుందనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్ర 6.30 గంటలకు గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను కలుసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరుగనుందనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) శనివారం సాయంత్ర 6.30 గంటలకు గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను కలుసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది.
యూపీ క్యాబినెట్‌లో మొత్తం 60 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులుతో కలిసి 54 మంది ఉన్నారు. వీరిలో 21 మంది క్యాబినెట్ మంత్రులు, 14 మంది స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు, 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. దీంతో కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే వీలుంది. మంత్రివర్గం నుంచి పలువురిని తప్పించాలని తొలుత పార్టీ అధిష్టానం ఆలోచన చేసిందని, అయితే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించే ఆరుగురిలో కృష్ణ పాశ్వాన్, సమాజ్‌వాదీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే పూజా పాల్, మనోజ్ పాండే, భూపేంద్ర చౌదరి, అశోక్ కటారియా, రోమి సహాని ఉంటారని తెలుస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ 2022లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. 2024 మార్చిలో తొలిసారి క్యాబినెట్ విస్తరణ జరిపారు. కాగా, 2027లో ఉత్తప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ప్రాంతాలు, కులాల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని తాజా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
విజయ్‌కు లైన్ క్లియర్.. మద్దతు లేఖ అందజేసిన వీసీకే
కేరళ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ