Share News

కేరళ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ

ABN , Publish Date - May 09 , 2026 | 04:51 PM

కేరళ సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది.

కేరళ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
Kerala

ఇంటర్నెట్ డెస్క్: కేరళ సీఎం ఎవరవుతారే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపిక పంచాయతీ ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో వీడీ సతీశన్, రమేష్ చిన్నితలా, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇక ఖర్గే నివాసానికి కేరళ కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిశీలకులు సేకరించారు. అనంతరం, ఎమ్మెల్యేల అభిప్రాయాలపై అధిష్టానానికి నివేదిక ఇచ్చారు.


ఈ నేపథ్యంలో కేరళలో కీలకమైన నేతలతో చర్చించిన అనంతరం ఏఐసీసీ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కేరళ సీఎం ఎవరనే దానిపై ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. సతీశన్, రమేశ్ చిన్నితలా, కేసీ వేణుగోపాల్‌కు మద్దతుగా రాష్ట్రంలో వారి మద్దతుదారులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించడంతో పాటు అనేక ప్రాంతాల్లో తమ ప్రియతమ నాయకుల బిల్‌బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

తమిళనాడులో కృత్రిమ సంక్షోభం: భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి

నెట్టింట అన్నాడీఎంకే చీఫ్ పోస్టు.. తమిళనాడులో మరింత పెరిగిన ఉత్కంఠ

Updated Date - May 09 , 2026 | 05:00 PM