Share News

హామీకి కట్టుబడి ఉండాలి

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:07 AM

ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల మీద దర్యాప్తును కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలు.. కేంద్రప్రభుత్వం తమకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) పేర్కొంది.

హామీకి కట్టుబడి ఉండాలి

  • విద్యార్థుల మీద నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలి

  • లేదంటే మళ్లీ ఉద్యమం: సీజేపీ

  • సుప్రీం ఆదేశాల నేపథ్యంలో హెచ్చరిక

  • విద్యార్థులను కాల్చిపడేసేవాడిని! సంఘ్‌ నేత అవాకులు..

  • పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు

  • విద్యార్థులపై బలప్రయోగం చేస్తారా?

  • ఢిల్లీ పోలీసులకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ, జూలై 28: ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల మీద దర్యాప్తును కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలు.. కేంద్రప్రభుత్వం తమకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) పేర్కొంది. విద్యార్థుల మీద నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని కేంద్రప్రభుత్వం తమకు విస్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే తాము ఉద్యమాన్ని విరమించిన సంగతిని గుర్తు చేసింది.


తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు.. విద్యార్థులను వేధించటానికి ఆయుధంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామంటూ విద్యార్థులకు హామీ ఇచ్చిన సంగతిని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల మీద నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు తాము కేంద్రానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుందని, ఆలోపు అది జరగకపోతే తిరిగి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వమే తన హామీలను ఉల్లంఘిస్తే.. యువత శాంతియుతంగా ఎలా ఉంటుందని నిలదీసింది. ఈ మేరకు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - Jul 29 , 2026 | 08:22 AM