Share News

ఎండీఆర్‌కు మద్దతు తెలిపిన ప్యానెల్‌లో ఐదుగురు కాంగ్రెస్ లీడర్లు: బీజేపీ

ABN , Publish Date - Sep 17 , 2026 | 08:28 AM

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధానాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆయన వైఖరిని తప్పుపట్టింది. యూపీఐకి సంబంధించి దశలవారీ ఆదాయ నమూనాను సూచించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారని బీజేపీ వర్గాలు గుర్తుచేశాయి.

ఎండీఆర్‌కు మద్దతు తెలిపిన ప్యానెల్‌లో ఐదుగురు కాంగ్రెస్ లీడర్లు: బీజేపీ

ఇంటర్‌నెట్ డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధానాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆయన వైఖరిని తప్పుపట్టింది. యూపీఐకి సంబంధించి దశలవారీ ఆదాయ నమూనాను సూచించిన పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారని బీజేపీ వర్గాలు గుర్తుచేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం, సీనియర్ లీడర్లు మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిషోరీ లాల్, కె.గోపీనాథ్ ఈ కమిటీలో కాంగ్రెస్ తరపున సభ్యులుగా ఉన్నారని, ఆగస్టు 12న ఈ కమిటీ నివేదికను ఆమోదించిన సమయంలో ఈ ఐదుగురు ఎంపీలు హాజరయ్యారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడు వారి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదని బీజేపీ తెలిపాయి. చిదంబరం, మనీష్ తివారీ పార్లమెంటరీ కమిటీలో మద్దతు తెలిపిన అంశాన్నే రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ వర్గాలు ప్రశ్నించాయి.


యూపీఐకి స్థిరమైన ఆదాయ నమూనా అవసరం: కమిటీ

యూపీఐ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలదొక్కుకునేందుకు తగిన ఆదాయ నమూనా అవసరమని పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీ తన నివేదికలో పేర్కొంది. అధిక విలువ కలిగిన లావాదేవీలకు దశలవారీగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే విధానాన్ని పరిశీలించాలని కమిటీ సూచించిన విషయం తెలిసిందే. కాగా.. యూపీఐ వ్యవస్థకు కేంద్ర బడ్జెట్‌లో సుమారు రూ.2,000 కోట్లు కేటాయించగా, పరిశ్రమ అంచనాల ప్రకారం యూపీఐ పర్యావరణ వ్యవస్థ నిర్వహణకు అవసరమైన వ్యయం సుమారు రూ.20,700 కోట్లుగా ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ సబ్సిడీలపైనే యూపీఐ వ్యవస్థ నిరంతరం ఆధారపడే పరిస్థితి కొనసాగితే, చెల్లింపుల మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, మోసాల నివారణ వంటి కీలక రంగాలకు అవసరమైన పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూపీఐ వ్యవస్థకు ఆర్థికంగా స్థిరమైన ఆదాయ వనరులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ స్పష్టం చేసింది.


Also Read:

వినాయక చవితి ఖర్చు రూ. 10వేల కోట్లకు పైనే!

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు..

హైదరాబాద్‌-వత్వా మార్గంలో ప్రత్యేక రైళ్లు

Updated Date - Sep 17 , 2026 | 08:28 AM