Share News

ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న నాలుగు పేజీల లేఖ

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:11 AM

'కొడుకు లేని ఇల్లు మాకు వల్లకాడు' అని భావించిన ఓ దంపతులు.. మృత్యువులోనూ కుమారుడి చెంతకే చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌‌లో చోటుచేసుకుంది.

ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న నాలుగు పేజీల లేఖ
Chhattisgarh Tragedy news

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 17: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh Tragedy News) విషాదం చోటుచేసుకుంది. వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు గల కారణాన్ని నాలుగు పేజీల లేఖలో వివరించారు. ఎంతోఅన్యోన్యంగా ఉండే దంపతులు మరణించడంతో స్థానికంగా విషాధ ఛాయాలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జాంజ్‌గిర్-చంపా జిల్లా పరిధిలోని ధర్దేయ్ అనే గ్రామంలో కృష్ణా పటేల్(48), రమాబాయి(47) నివాసం ఉంటున్నారు. వారికి ఆదిత్య అనే 21 ఏళ్ల కుమారుడు ఉండే వాడు. అతడు 2024లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒకగానొక్క కొడుకు మరణించడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పటి వరకు ఆదిత్య సందడితో కలకలలాడి ఆ ఇళ్లు ఒక్కసారిగా బోసి బోయింది. కుమారుడి మరణంతో కృష్ణా దంపతులు బయట ప్రపంచానికి దూరంగా ఉన్నారు. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా కలిసే వారు కాదు. ఇలా రెండేళ్లు గడిపిన కృష్ణా దంపతులు.. ఆదివారం దారుణ నిర్ణయం తీసుకున్నారు.


ఆదివారం రాత్రి కృష్ణా పటేల్, రమా భాయ్ దంపతులు వారి ఇంటి ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జంట చనిపోయే ముందు నాలుగు పేజీల లేఖ, ఒక వీడియోను విడుదల చేశారు. ' ఆదిత్యనే మా ప్రపంచం. అతడు లేని జీవితం మాకు వృథా అనిపిస్తుంది. మేము కూడా దేవుడి దగ్గరకు వెళ్తున్నాము. మా కొడుకు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాము. మా మరణం గురించి ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. మాకు సంబంధించి రావాల్సిన డబ్బులు మా అన్నయ్యకు దక్కేలా చూడండి' అంటూ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కృష్ణా, రమ తమతో ఎంతో కలివిడిగా ఉండేవారని, కుమారుడి మరణంతో వారిద్దరు ఒక్కసారిగా కుంగిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Chhattisgarh-Tragedy-News.jpg


ఇవి కూడా చదవండి:

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఐటీ కంపెనీలు ఐదేళ్లలో గాయబ్‌!

Updated Date - Feb 17 , 2026 | 11:30 AM