సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టింది 34,855 కోట్లు
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:32 AM
దేశంలో వివిధ మార్గాల్లో సైబర్ క్రిమినల్స్ కాజేసిన మొత్తం రూ.34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. వాటిలో ఇప్పటి వరకు రూ.12,229 కోట్లను అటాచ్ చేసినట్టు...
వాటిలో 12,229 కోట్లను అటాచ్ చేశాం: ఈడీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలో వివిధ మార్గాల్లో సైబర్ క్రిమినల్స్ కాజేసిన మొత్తం రూ.34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. వాటిలో ఇప్పటి వరకు రూ.12,229 కోట్లను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. సైబర్ నేరాలకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నమోదైన 234 కేసుల్లో ఎక్కువ శాతం సొమ్ము.. మ్యూల్ ఖాతాలు, షెల్ కంపెనీలు, క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గాల ద్వారా నిర్వహిస్తున్నట్టు గుర్తించామని ఆ అధికారి తెలిపారు. గతవారం ఢిల్లీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీఈబీ), ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్... ‘సైబర్ ఆధారిత మోసాలను అరికట్టడం, వాటి వ్యవస్థను ఛేదించడం’ పేరిట నిర్వహించిన జాతీయ సమావేశంలో ఈడీ ఈ వివరాలు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..