Share News

పోక్సో కేసులో పారిశ్రామికవేత్త వీరమణి అరెస్టు

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:10 AM

బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డాడనే నేరారోపణలపై ప్రముఖ ప్రముఖ గ్రానైట్‌ సంస్థ యజమాని, పారిశ్రామిక వేత్త వీరమణిని.., ఆయనకు సహకరించిన...

పోక్సో కేసులో పారిశ్రామికవేత్త వీరమణి అరెస్టు

చెన్నై, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డాడనే నేరారోపణలపై ప్రముఖ ప్రముఖ గ్రానైట్‌ సంస్థ యజమాని, పారిశ్రామిక వేత్త వీరమణిని.., ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది అక్టోబరు 6న నగరానికి చెందిన ఓ సంఘసేవకుడు సెంట్రల్‌ క్రైంబ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ను కలుసుకుని గుర్తు తెలియని ఓ వ్యక్తి తన కార్యాలయానికి వచ్చి ఎనభైయేళ్లకు పైగా వయస్సున్న ఓ వ్యక్తి మైనర్‌ బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న అశ్లీల వీడియో దృశ్యాలు కలిగిన పెన్‌డ్రైవ్‌ను తనకు ఇచ్చాడని తెలిపారు. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న వృద్ధుడు ఎవరో కనుగొని అరెస్టు చేయాలని కోరారు. పోలీసులు ఆ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించినప్పుడు పలువురు బాలికలపై ఆ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడుతున్న వీడియో దృశ్యాలు కూడా కనిపించాయి. ఆ పెన్‌డ్రైవ్‌ వీడియో ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసుకుని, ఆ వృద్ధుడి ఆచూకీని కనుగొనేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిపారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆ వృద్ధుడు ప్రముఖ గ్రానైట్‌ సంస్థ యజమాని వీరమణి (84) అని తేలింది. తేనాంపేట ప్రాంతంలో ఓ ఇంటిని వీరమణి అద్దెకు తీసుకుని మహేంద్రసింహన్‌, శాంతి అనే దంపతులను కాపురం చేయించాడని, ఆ దంపతులు తరచూ మైనర్‌ బాలికలను ఆ ఇంటికి రప్పించేవారని, ఆ విషయం తెలుసుకుని వీరమణి అక్కడికి వెళ్లి బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడేవాడని వెల్లడైంది.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 06:10 AM