తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తారలు..
ABN , Publish Date - Apr 23 , 2026 | 10:39 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ అగ్రతారలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటి శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ (గురువారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ క్యూ కడుతున్నారు.
తమిళనాడు సినీ అగ్రతారలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, ప్రభుదేవా, శివకార్తికేయన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటి శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత, తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కూడా ఓటు హక్కును వాడుకున్నారు. కాగా, ఈయన తిరుచిరాపల్లి తూర్పు, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రముఖ నటుడి శివకార్తికేయన్ తన భార్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీరంతా చెన్నైలోని తమతమ పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు వేశారు. ఓటు వేసినట్లుగా వారి చూపుడు వేలుకు ఎన్నికల అధికారులు సిరాను పూశారు. అనంతరం పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన సినీతారలు సిరా గుర్తును చూపుతూ ఫొటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. తాజాగా వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..
ఓటేయడం మీ బాధ్యత, కర్తవ్యం: ప్రధాని మోదీ