Share News

విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష.. కావేరి వివాదంపై ఒత్తిడి పెంచుతున్న ప్రతిపక్షాలు..

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:49 PM

తమిళనాడులో కావేరి జలాల వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కర్ణాటకలోని మేకేదాటు ప్రాజెక్టు, కావేరి నీటి విడుదల అంశాల గురించి ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి

విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష.. కావేరి వివాదంపై ఒత్తిడి పెంచుతున్న ప్రతిపక్షాలు..
Vijay

తమిళనాడులో కావేరి జలాల వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కర్ణాటకలోని మేకేదాటు ప్రాజెక్టు, కావేరి నీటి విడుదల అంశాల గురించి ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తొలి పెద్ద రాజకీయ పరీక్ష ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు (Cauvery dispute).


రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకతో చర్చలు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి, సుప్రీంకోర్టులో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని పార్టీలతో కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే అఖిలపక్ష సమావేశం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది (Vijay TV Cauvery dispute).


కావేరి అంశంపై ఇప్పటికే తమిళనాడు శాసనసభలో విస్తృతంగా చర్చించి ఏకగ్రీవ తీర్మానం ఆమోదించామని, అన్ని పార్టీలు అప్పుడే తమ అభిప్రాయాలు వెల్లడించాయని మంత్రులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో సమావేశం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. కాగా, ఆగస్టు 3న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో విజయ్ భేటీ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవన్న కారణంతో ఆ సమావేశం వాయిదా పడింది (Cauvery water issue).


కావేరి వివాదంపై తమిళనాడులో పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలని, మేకేదాటు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.


ఇవి కూడా చదవండి..

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..


వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 02 , 2026 | 09:58 PM