Share News

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:39 PM

ఈరోజు (బుధవారం) క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను రైల్యే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!
Cabinet decisions

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఈరోజు (బుధవారం) కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ విషయాలను రైల్యే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.19,934 కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ (సీఐఈ) మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టం పథకానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయించింది. తమిళనాడులోని కామరాజా పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు 4,288 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.


అలాగే అస్సాంలోని సిల్చారు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.2,014 కోట్లను కేంద్ర క్యాబినెట్ కేటాయించింది. పోస్టల్ ఆపరేషన్ పథకం కోసం ఒక రూ.1,141 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. పోస్టల్ శాఖలో ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ పథకం కోసం మరో 1,491 కోట్ల రూపాయలు అందించేందుకు సిద్ధమైంది. కాగా సీఐఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టం పథకం ద్వారా మౌలిక వసతులు మరింత బలోపేతమవుతాయని కేంద్రం భావిస్తోంది.


ఈ వార్తలూ చదవండి

పుణే జిల్లా కోర్టు వద్ద కాల్పులు, కొడవళ్లతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2026 | 04:13 PM