Share News

అక్క కోసం 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:48 PM

రక్తసంబంధం విలువ రోజు రోజుకూ తగ్గిపోతున్న ఈ రోజుల్లో.. అక్కాతమ్ముడు మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా కళ్లు చెమర్చే ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రాణ సమానమైన అక్క.. కారులో అత్తవారింటికి వెళుతుంటే, తమ్ముడు ఎడబాటు తట్టుకోలేక..

అక్క కోసం 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు.. వీడియో వైరల్
Brother Sister Emotional Video

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి తర్వాత వధువు(bride) తన భర్తతో కలిసి అత్తవారింటికి వెళుతుంటే.. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఎంతగా ఎమోషన్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ దృశ్యం చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో భావోద్వేగాని (Emotional)కి గురవుతారు. కానీ, బిహార్ లో అంతకు మించిన భావోద్వేగ క్షణాలు కనిపించాయి. వివాహం అనంతరం అప్పగింతల తర్వాత నవ వధువు భర్తతో కలిసి కారులో బయలుదేరింది. తన అక్క విడిచి వెళ్లడం తట్టుకోలేకపోయిన తమ్ముడు, ఆమెను సాగనంపడానికి సైకిల్ పై బయలుదేరాడు. ఏదో కొద్ది దూరం అనుకుంటే పొరపాటే.. ఆమె ప్రయాణిస్తున్న కారు వెంటే దాదాపు 70 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా సైకిల్ తొక్కాడు. ఈ ఘటన బిహార్‌(Bihar)లోని పూర్ణియా జిల్లా చంపానగర్‌లో జరిగింది.


ఈ వీడియోను సుశాంత్_సుప్రియ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ అద్భుత దృశ్యాలను చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘డబ్బు, ఆస్తుల కోసం గొడవపడే ఈ కాలంలో ఇలాంటి అనుబంధాలు ఉండటం నిజంగా గ్రేట్’ అని కొందరు, ‘ఆ తమ్ముడి ప్రేమ వెలకట్టలేం’ అని మరికొందరు, ‘దేవుడు మీ అక్కకు నీలాంటి మంచి తమ్ముడినిచ్చాడు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

అరేబియా సముద్రంలో చమురు స్మగ్లింగ్.. ఆట కట్టించిన కోస్ట్ గార్డ్..

Updated Date - Feb 07 , 2026 | 08:34 PM