బాబా రామ్‌దేవ్‌పై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:59 PM
యోగా గురు బాబా రామ్‌దేవ్ 'స్వదేశీ' ప్రచారంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విమర్శలు గుప్పించారు. రామ్‌దేవ్ స్వదేశీ ప్రచారంలోకి నకిలీ ఉత్పత్తులు, విదేశీ వస్తువుల చేరాయని ఆరోపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. స్వదేశీ నినాదంతో ప్రారంభమైన బాబా రామ్‌దేవ్‌పై ప్రచారంలోకి ఇప్పుడు కల్తీ ఉత్పత్తులు, విదేశీ వస్తువులు చేరాయని శరణ్ సింగ్ తీవ్రంగా విమర్శించాడు. గతంలో రామ్‌దేవ్ చేసిన ఉద్యమాలు సమంజసంగానే ఉన్నప్పటికీ, కాలక్రమేణా ఆయన విధానాలు మారాయని ఆరోపించాడు.
రామ్‌దేవ్ గతంలో చేపట్టిన ఆందోళనలను గుర్తు చేస్తూ.. ఈసారి ఆయన ఉద్యమం చేయదలిస్తే సింధూరం, సల్వార్ ధరించి రాకుండా ఒక మగాడిలాగా నిరసన తెలిపి... నిర్ణయాత్మక పోరాటం చేయాలని శరణ్ సింగ్ సవాల్ చేశాడు. దేశంలో విరివిగా లభిస్తున్న కల్తీ నెయ్యికి బాబా రామ్‌దేవే ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా, రామ్‌దేవ్ కంపెనీ ఇప్పుడు విదేశీ లోదుస్తులను కూడా తయారు చేస్తోందని వ్యంగాస్త్రాలు సంధించారు.
గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. 2022లో పతంజలి బ్రాండ్ పేరును ఉపయోగించవద్దని బ్రిజ్ భూషణ్ డిమాండ్ చేశారు. మహర్షి పతంజలి జన్మస్థలమైన గోండా అభివృద్ధికి వారు ఎలాంటి సేవ చేయలేదని ఆరోపించారు. మరోవైపు, 2023లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు బాబా రామ్‌దేవ్ రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
ఇవి కూడా చదవండి:
వెనక్కి తగ్గం.. భారత్‌తో మ్యాచ్ ఆడుతాం: బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య
నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్