Share News

ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో వైరల్..

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:54 PM

న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండో రోజు ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. బ్రిక్స్ దేశాల నేతలు తీసుకున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో వైరల్..
BRICS family photo

ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండో రోజు ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. బ్రిక్స్ దేశాల నేతలు తీసుకున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీ మధ్యలో ఉండగా.. ఆయనకు ఇరువైపులా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిలిచారు (Modi Putin Xi photo).


భారత్ మండపంలో బ్రిక్స్ దేశాధినేతలు సాంప్రదాయ 'ఫ్యామిలీ ఫొటో'కు ఫోజిచ్చారు. ముందు వరుసలో పుతిన్, మోదీ, జిన్‌పింగ్ పక్కపక్కనే నిలబడి నవ్వుతూ కెమెరాలకు పోజిచ్చిన దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్, రష్యా, చైనా మధ్య ఉన్న కీలక దౌత్య సంబంధాలను ప్రతిబింబించే చిత్రంగా ఈ ఫొటో అంతర్జాతీయ మీడియాలోనూ ప్రాధాన్యం పొందింది. మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ముగ్గురూ వరుసగా మూడోసారి బ్రిక్స్ వేదికపై కనిపించడం మరో విశేషం (BRICS family photo).


2024లో కజాన్‌లో, 2025లో తియాంజిన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశాల తర్వాత ఇప్పుడు న్యూఢిల్లీలో ఈ ముగ్గురూ భేటీ అయ్యారు (BRICS Summit 2026). అయితే ఈసారి జిన్‌పింగ్ భారత్‌కు రావడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 తర్వాత ఆయన తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్నారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇరువైపులా ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఆయన పర్యటన జరిగింది.


ఇవి కూడా చదవండి..

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి.. ఆంథ్రోపిక్ సీఈఓ‌కు మస్క్, ఆల్ట్‌మన్ మద్దతు..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 13 , 2026 | 01:45 PM