మోదీ ఇచ్చిన బ్రిక్స్ విందుకు జిన్‌పింగ్ ఎందుకు వెళ్లలేదు.. అసలు కారణం ఇదేనా..
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:09 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. ఈ విందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు పలు దేశాల నేతలు హాజరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. ఈ విందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు పలు దేశాల నేతలు హాజరయ్యారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాత్రం రాలేదు. దీంతో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. జిన్‌పింగ్ ఎందుకు హాజరుకాలేదనే విషయంపై చైనా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు (Xi Jinping BRICS 2026).
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సుదీర్ఘ ప్రయాణం, వరుస సమావేశాలతో అలసిపోయిన జిన్‌పింగ్ విశ్రాంతి కోసం హోటల్‌కు వెళ్లారని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న జిన్‌పింగ్.. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు ప్రధాని మోదీతో కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఇతర నేతలను కూడా కలిశారు. జెట్ లాగ్, సమయ వ్యత్యాసం, వరుస అధికారిక కార్యక్రమాలతో జిన్‌పింగ్ అలసిపోయారని చైనా వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి (Modi Xi Jinping meeting).
విందుకు ముందు మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు (BRICS gala dinner). సరిహద్దులో శాంతి, వాణిజ్యం, మార్కెట్ యాక్సెస్, ప్రజల మధ్య సంబంధాలు, నేరుగా విమాన సర్వీసులు వంటి అంశాలపై చర్చించారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలని ఇరువురు అంగీకరించారు. 'పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం' అనే మూడు అంశాలు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి.. ఆంథ్రోపిక్ సీఈఓకు మస్క్, ఆల్ట్‌మన్ మద్దతు..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..