పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన బాంబే కోర్టు
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:04 PM
ప్రధాని మోదీపై అనుచిత వాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఈ రోజు(మంగళవారం)ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీపై అనుచిత వాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసును కొట్టివేయాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌ను బాంబే హై కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన విచారణ యథావిధిగా కొనసాగనుంది.
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ప్రధానిని రాహుల్‌గాంధీ .. ‘కమాండర్ ఇన్ థీఫ్’ అని పేర్కొంటూ సోషల్‌మీడియాలో, సభలలో వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ కార్యకర్త మహేష్ శ్రీమల్ పరువునష్టం కింద బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో పరువు నష్టం కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు