బెంగాల్‌లో బాబ్రీ మసీదు కట్టనీయం: అమిత్‌షా
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:52 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మమతా దీదీ ఎంత బలంగా కోరుకున్నారా, ఎన్ని గట్టి ప్రయత్నాలు చేసినా బెంగాల్‌లో బాబ్రీ మసీదును బీజేపీ కట్టనీయదని స్పష్టం చేశారు.
నార్త్ 24 పరగణాలు: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మమతా దీదీ ఎంత బలంగా కోరుకున్నా, ఎన్ని గట్టి ప్రయత్నాలు చేసినా బెంగాల్‌లో బాబ్రీ మసీదును బీజేపీ కట్టనీయదని స్పష్టం చేశారు. టీఎంసీ సిండికేట్ ముఠాలను బెంగాల్ నుంచి పారిపోయేలా చేస్తామన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఈనెల 23న జరుగనుండగా, రెండో విడత ప్రచారంలో భాగంగా నార్త్ 24 పరగణాల జిల్లాలోని డుమ్ డుమ్ ఉత్తర్ ఏరియాలో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా పాల్గొన్నారు.
'ఇవాళ బెంగాల్ మొత్తం సిండికేట్లమయంగా మారింది. సిమెంట్, ఇసుక, ఇటుకలు ఏమి కావాలన్నా మీరు సిండికేట్లకు డబ్బులు చెల్లించాలి. డుమ్ డుమ్ ప్రజలకు నేను ఒకటే చెప్పదలచుకున్నాను. ఈనెల 5వ తేదీ తర్వాత ఈ సిండికేట్ సభ్యులు తట్టాబుట్టా సద్దుకుని బెంగాల్ నుంచి పారిపోవడమో, వసలపోవడమో జరుగుతుంది' అని అమిత్‌షా అన్నారు.
హుమయూన్ కబీర్ పేరుతో బాబ్రీ మసీదు నిర్మించాలని మమతాబెనర్జీ కోరుకుంటున్నారని అమిత్‌షా విమర్శించారు. 'ఎవరూ ఆందోళన చెందవద్దు. మమతా దీదీ ఎంత గట్టిగా కోరుకున్నప్పటికీ బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని బీజేపీ అనుమతించే ప్రసక్తే లేదు' అని అన్నారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, దుర్గాపూర్ మెడికల్ కాలేజీ, సౌత్ కోల్‌కతా లా కాలేజీలో ఘటనలు చూస్తే రాష్ట్రంలో శంతిభద్రతలు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్ధమవుతుందన్నారు. రాత్రివేళల్లో మహిళల సంచారంపై మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. మే 5 తర్వాత ఆ పరిస్థితి ఉండదని, చిన్నారి ఆడపిల్లలు కూడా ధైర్యంగా స్కూటరుపై బయటకు వస్తే ఏ దుండగుడు అడ్డుకునే పరిస్థితి ఉండదని చెప్పారు. 'బంగారు బంగ్లా' కలను బీజేపీ సాకారం చేస్తుందని, బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని తిరిగి సుసంపన్న చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదు..
కాంగ్రెస్ పార్టీ తమిళనాడు, పుదుచ్చేరిలో రెండంకెల స్థాయిలో కూడా సీట్లు తెచ్చుకోలేదని, బెంగాల్‌లో ఆ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదని అమిత్‌షా అన్నారు. చొరబాటుదారుల నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించే వారికే ప్రజలు ఓటు వేయాలని, ఈ ఎన్నికలు ఒక ఎమ్మెల్యేనో, ప్రభుత్వాన్నో ఎన్నుకోవడానికే సంబంధించి ఎన్నికలు కావని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని చెప్పారు. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో తొలివిడత 152 నియోజకవర్గాల్లో ఈనెల 23న పోలింగ్ జరుగునుండగా, తక్కిన స్థానాల్లో ఈనెల 29న పోలింగ్ జరుగుతుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపే ప్రతినిధి బృందం ఫిర్యాదు
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ప్రధాని మోదీ ట్వీట్..