చివరి నిమిషంలో అన్నాడీఎంకే మరో 10 హామీలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:39 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనున్న చివరినిమిషంలో అన్నాడీఎంకే మరో 10హామీలు ఇచ్చింది. మామిడి పంటకు గిట్టుబాటు..
చెన్నై, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనున్న చివరినిమిషంలో అన్నాడీఎంకే మరో 10హామీలు ఇచ్చింది. మామిడి పంటకు గిట్టుబాటు ధర, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకొని, విధినిర్వహణలో ప్రమాదశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.20లక్షలు. కల్లుగీత కార్మికులు చెట్లపై నుంచి జారిపడి మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.20లక్షలు పరిహారం, ప్రభుత్వ కేబుల్ టీవీ ఫీజును 50ు తగ్గింపు, స్త్రీలపై నేరాల నివారణకు రోజంతా(24/7) పనిచేసే వార్ రూమ్‌ల ఏర్పాటు తదితర హామీలు ఇందులో ఉన్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి(ఈపీఎస్) మంగళవారం సాయంత్రం తాజా 10 హామీలను వెల్లడించారు. ఇప్పటికే 297 హామీలను ఆ పార్టీ ప్రకటించగా, తాజాగా మరో పది హామీలను వాటికి జత చేస్తున్నట్టు వివరించారు.