Share News

17 నుంచి బీజేపీ ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:04 AM

గుజరాత్‌ సీఎంగా, భారత ప్రధానిగా ప్రభుత్వంలో నిరాటంకంగా పాతికేళ్లుగా ప్రధాని మోదీ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు...

17 నుంచి బీజేపీ ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

మోదీ 25ఏళ్ల ప్రస్థానంపై నెలపాటు దేశవ్యాప్త

కార్యక్రమాలు..బీజేపీ అధ్యక్షుడు నబీన్‌ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: గుజరాత్‌ సీఎంగా, భారత ప్రధానిగా ప్రభుత్వంలో నిరాటంకంగా పాతికేళ్లుగా ప్రధాని మోదీ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఆయన పుట్టినరోజైన ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలతో యువతకు చేరువవడం దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2014 మే 26 నుంచి ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ జన్మదినమైన 17వ తేదీని ‘సేవాదివ్‌స’గా జరుపనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ప్రకటించారు. ఆరోజు దేశమంతటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం ‘ఆశీర్వాద్‌ కా దియా(ఆశీర్వాద దీపం)’ కార్యక్రమం ఉంటుందని.. మోదీ పాతికేళ్ల ప్రజాజీవితాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు దీపాలు వెలిగిస్తారని తెలిపారు. అక్టోబరు 7తో ఆయన ప్రజాజీవితంలోకి వచ్చి పాతికేళ్లు పూర్తవుతాయని..‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా ఆ రోజు చివరి, ప్రధాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 06:04 AM