ఢిల్లీకి డార్క్ సూపర్‌హీరో అవసరం లేదు.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..
ABN , Publish Date - Oct 13 , 2026 | 10:34 AM
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్యాట్‌మ్యాన్ మాస్క్ ధరించడంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు నిర్వహించిన నిరసనలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాట్‌మ్యాన్ మాస్క్‌లతో కనిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్యాట్‌మ్యాన్ మాస్క్ ధరించడంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు నిర్వహించిన నిరసనలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాట్‌మ్యాన్ మాస్క్‌లతో కనిపించారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఢిల్లీకి డార్క్ సూపర్‌హీరో, రాబిన్ అవసరం లేదు' అంటూ కేంద్ర మంత్రి జయంత్ సింగ్ వ్యాఖ్యానించారు (Rahul Gandhi Batman Mask,).
అక్టోబర్ 12న ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు వైపు ర్యాలీ చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో కొందరు యువకులు బ్యాట్‌మ్యాన్ మాస్క్‌లు ధరించి పాల్గొన్నారు. వారి వద్ద ఉన్న మాస్క్‌ను రాహుల్ గాంధీ తీసుకుని ధరించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా రాహుల్ మాస్క్ ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి (BJP Reaction).
బ్యాట్‌మ్యాన్ కథల్లో గోథమ్ సిటీ నేరాలతో సతమతమయ్యే కల్పిత నగరం (INDIA Bloc Protest). అక్కడి ప్రజలను రక్షించే సూపర్‌హీరోగా బ్యాట్‌మ్యాన్‌ను చూపిస్తారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి జయంత్ సింగ్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పందించారు. 'ఢిల్లీ గోథమ్ కాదు. మాకు డార్క్ సూపర్‌హీరో, రాబిన్ అవసరం లేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాట్‌మ్యాన్‌కు సహాయకుడిగా ఉండే రాబిన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి..
రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. 2027 ప్రపంచకప్‌లో అసలైన బలం ఇదే: మహమ్మద్ కైఫ్
ప్రతిపక్ష కూటమి పిటిషన్‌లో 14 లోపాలు.. కోర్టు ఫీజులో రూ.220 తక్కువగా చెల్లింపు..