Share News

వ్యక్తుల కన్నా పార్టీ ప్రతిష్ఠే ముఖ్యం

ABN , Publish Date - May 21 , 2026 | 05:44 AM

వ్యక్తుల కన్నా పార్టీ ప్రతిష్ఠే ముఖ్యమని, తెలంగాణలో పార్టీ నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ పాటించేలా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావుకు బీజేపీ జాతీయ...

వ్యక్తుల కన్నా పార్టీ ప్రతిష్ఠే ముఖ్యం

  • నాయకులు క్రమశిక్షణ పాటించేలా చూడండి

  • రాంచందర్‌రావుకు బీజేపీ అగ్రనేతల దిశానిర్దేశం

న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): వ్యక్తుల కన్నా పార్టీ ప్రతిష్ఠే ముఖ్యమని, తెలంగాణలో పార్టీ నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ పాటించేలా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్‌, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సంతోష్‌ సూచించినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాల గురించి రాంచందర్‌రావు వివరించగా.. పలు అంశాలపై వారు దిశానిర్దేశం చేశారు. ఏ అంశం పైనా దాటవేత ధోరణి పాటించకుండా బాధ్యత వహించేలా చూడాలని, ఒకే అంశంపై భిన్న స్వరాలు వినిపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో పార్టీ ఆఫీసు బేరర్ల నియామకంపైనా రాంచందర్‌ రావు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. పార్టీ శిక్షణ శిబిరాల గురించి ఆయన సంతో్‌షజీకి వివరించారు. కాగా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌కు రాంచందర్‌రావు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట తెలంగాణ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు సురేందర్‌ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:44 AM