Share News

రోడ్డుకు ఇరువైపుల కూర్చొని.. విద్యార్థులు పరీక్షలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:09 PM

బిహార్‌లో జరిగే ఏ పరీక్షలైనా ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా కొంతమంది విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని పరీక్షలు రాయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

రోడ్డుకు ఇరువైపుల కూర్చొని.. విద్యార్థులు పరీక్షలు.. వీడియో వైరల్
Siwan Exam Controversy

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో జరిగే ఏ పరీక్షలైనా ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య విమానాశ్రయ రన్‌వే పై విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌లోని సివాన్‌ జిల్లాలో విద్యార్థులు తరగతి గదిలో కాకుండా ఎండలో, రోడ్డు పక్కన కూర్చుని పరీక్షలు రాస్తున్న దృశ్యాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సాధారణంగా పరీక్షలు అంటే ప్రశాంతమైన వాతావరణంలో, గదుల్లో జరగాలి. కానీ, సివాన్ జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌.. విద్యార్థులకు ఇటీవల పరీక్షలు నిర్వహించింది. కాకపోతే, అక్కడ విద్యార్థులకు సరిపడ వసతులు, కుర్చీలు లేకపోవడంతో తరగతి గదిలో కాకుండా రోడ్డుకు ఇరువైపులా కూర్చొని ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థులు నిల్చొని పరీక్షలు రాశారు. పక్కనే వాహనాల రద్దీ, జనం రాకపోకలు సాగుతున్నా.. ఆ గోల మధ్యే విద్యార్థులు తలలు వంచుకుని పరీక్షలు రాశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘బిహార్‌లో అక్షరాస్యత తక్కువగా ఉండటానికి ఇలాంటి దుస్థితులే కారణం’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం వల్లే.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

కుక్క కాటు.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స! జర్మన్ వ్యక్తికి ఆశ్చర్యం

కోపంతో పొడవడానికి వచ్చిన ఎద్దు.. ఇతను చేసిన చిన్న ట్రిక్‌తో.. చివరకు..

Updated Date - Apr 11 , 2026 | 05:26 PM