Share News

కుక్క కాటు.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స! జర్మన్ వ్యక్తికి ఆశ్చర్యం

ABN , Publish Date - Apr 10 , 2026 | 07:27 PM

కుక్క కరవడంతో భారత ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఒక జర్మన్ వ్యక్తి అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కుక్క కాటు.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స! జర్మన్ వ్యక్తికి ఆశ్చర్యం
German creator India video

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత దేశ పర్యటనలో ఉన్న ఒక జర్మన్ కంటెంట్ క్రియేటర్ ఇక్కడి వైద్య వ్యవస్థ చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగిందో చెబుతూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన సొంత దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. డేవిడ్ నెబెల్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను షేర్ చేశారు.

‘గత రాత్రి నన్ను ఒక వీధి కుక్క కరిచింది. రేబిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా.. అందుకుని నేను సమీపంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక నాకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ ట్రీట్‌మెంట్ అంతా ఉచితమే. నాకు నాలుగు ఇంజెక్షన్లు అవసరమయ్యాయి. కాస్త ఇబ్బంది పడ్డా. కానీ ఇక్కడి సర్వీసు ఎంత వేగంగా ఉందో చూశాక ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయి. మా దేశంలో మాత్రం ఇలా ఉండదు. విదేశీయులకు ఆసుపత్రిలో ఇలా ఉచిత ట్రీట్‌మెంట్ ఉండదు’ అని చెప్పుకొచ్చారు.


ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 3.3 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. విదేశాల్లో ఈ చికిత్సకు ఖర్చు భారీగా ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. భారత్‌లో మాత్రం ఇదే ట్రీట్‌మెంట్ చాలా తక్కువకే లభిస్తుందని అన్నారు.


ఈ వార్తలూ చదవండి:

కెనడాలో వైద్యుడు దొరక్క నరకం.. భారత్‌కు వచ్చేసిన ఎన్నారై

ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్

Updated Date - Apr 10 , 2026 | 07:37 PM