బిహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
ABN , Publish Date - Apr 12 , 2026 | 07:16 AM
బిహార్‌లోని కటిహార్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని కటిహార్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోడా బ్లాక్ పరిధిలోని జాతీయ రహదారి 31 పై గెరాబారి-బస్‌గత్తా చౌక్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్కు, పికప్ వ్యాన్ అత్యంత వేగంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పూర్ణియా జిల్లాకు నుంచి పికప్ వ్యాన్‌లో వస్తున్న ప్రయాణికులే ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక సాంకేతిక లోపమేదైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
పాలన అనేది సినిమా కాదు, రీటేక్స్ ఉండవు: విజయ్ ఎంట్రీపై చిదంబరం
జననాయగన్ లీక్‌ను బీజేపీతో ముడిపెట్టొద్దు: అన్నామలై