Share News

ఎమ్మెల్యే విశ్రాంతి గృహంలో యువతి, యువకుడు.. విచారణకు ఆదేశం

ABN , Publish Date - Nov 07 , 2026 | 09:49 PM

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఊహించని షాక్ తగిలింది. భోపాల్‌లో ఎమ్మెల్యేకు కేటాయించిన విశ్రాంతి గృహంలోని ఓ గదిలో యువతి, యువకుడు అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎమ్మెల్యే విశ్రాంతి గృహంలో యువతి, యువకుడు.. విచారణకు ఆదేశం
MLA Dinesh Jain Boss

భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఊహించని షాక్ తగిలింది. భోపాల్‌లో ఎమ్మెల్యేకు కేటాయించిన విశ్రాంతి గృహంలోని ఓ గదిలో యువతి, యువకుడు అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన మహిద్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేశ్ జైన్ బాస్‌కు ఎదురైంది. దీనిపై సంబంధిత అధికారులకు ఆయన ఫిర్యాదు చేయగా.. విచారణకు ఆదేశించారు.


మహిద్‌పూర్ ఎమ్మెల్యే దినేశ్ జైన్ బాస్‌కు భోపాల్ ఎమ్మెల్యేల విశ్రాంతి గృహంలోని బ్లాక్-3లో 14, 15 నంబర్ల గదులు కేటాయించారు. నవంబర్ 2న ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఆయన మధ్యాహ్నం విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. తొలుత 15వ గది తాళం అడగ్గా.. అందుబాటులో లేదని సిబ్బంది తెలిపారు. దీంతో ఆయన 14వ గది తాళం తీసుకున్నారు. అదే సమయంలో 15వ గదిలో ఓ యువతి, యువకుడు అభ్యంతరకర పరిస్థితుల్లో ఉండటాన్ని ఎమ్మెల్యే దినేశ్ గమనించారు. ఆయనను చూసిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై సిబ్బందిని ఎమ్మెల్యే గట్టిగా నిలదీశారు. గదులు తనకు కేటాయించినప్పటికీ బయటి వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు.


ఈ ఘటనపై మధ్యప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే ఫిర్యాదును అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ)కి పంపించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. గదుల తాళాలు ఎవరి వద్ద ఉన్నాయి? యువతి, యువకుడు లోపలికి ఎలా ప్రవేశించారు? సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఎమ్మెల్యేలకు కేటాయించిన విశ్రాంతి గృహంలోనే ఇలాంటి ఘటన జరగడంతో భద్రత, గదుల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, ఎమ్మెల్యే కేటాయించిన గదిలో యువతి, యువకుడు కనిపించారన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రపంచ రికార్డు.. లద్దాఖ్‌లో 13,629 అడుగుల ఎత్తులో ఐఏఎఫ్ విమానం ల్యాండింగ్..

ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..

Updated Date - Nov 07 , 2026 | 10:00 PM