Share News

హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ నినాదం..

ABN , Publish Date - Nov 16 , 2026 | 01:52 PM

హైదరాబాద్ వేదికగా జరిగిన 'భారత్ సమ్మిట్' సమావేశంలో ఇటలీకి చెందిన రాజకీయ నాయకుడు జాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.

హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ నినాదం..
Giacomo Filibeck

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ వేదికగా జరిగిన 'భారత్ సమ్మిట్' సమావేశంలో ఇటలీకి చెందిన రాజకీయ నాయకుడు జాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఉపయోగించిన 'ఓట్ చోర్, గద్దీ చోడ్' (ఓట్లను దొంగిలించిన వారు గద్దె దిగాలి) అనే నినాదాన్ని యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ (PES) సెక్రటరీ జనరల్ అయిన ఫిలిబెక్ ఈ సమ్మిట్‌లో ప్రస్తావించారు. భారత్‌లో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, 'ఒక వ్యక్తి, ఒక ఓటు' సిద్ధార్థాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ పోరాడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ సమ్మిట్‌లో విదేశీ పౌరుడు భారత అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విదేశీయులు ఎవరైనా భారతదేశానికి కేవలం కాన్ఫరెన్స్ లేదా సెమినార్ల కోసమే 'కాన్ఫరెన్స్ వీసా'పై వస్తారని, దేశ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వీసా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొనడమే కాకుండా, విదేశీ నేత ఆ వ్యాఖ్యలు చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొట్టడం పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు అభ్యతరాలు వ్యక్తం చేశారు. విదేశీ నాయకులను ఆహ్వానించి దేశ రాజకీయాలపై విమర్శలు చేయించడంపై విపక్షాలు అధికార కాంగ్రెస్‌ను తీవ్రంగా తప్పుపడుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

సచిన్‌లా ఎదుగుతాడా? కాంబ్లీలా మిగిలిపోతాడా?.. వైభవ్‌పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 16 , 2026 | 01:54 PM