గదిలో కూతురితో సన్నిహితంగా ఉద్యోగి.. అది చూసిన యజమాని..
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:36 PM
గదిలో యజమాని కుమార్తెతో ఓ ఉద్యోగి సన్నిహితంగా ఉన్నాడు. ఇది చూసిన ఆ యజమాని ఆగ్రహంతో ఉద్యోగిపై తీవ్రంగా దాడి చేయగా.. అతడు మరణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గదిలో యజమాని కుమార్తెతో ఓ ఉద్యోగి సన్నిహితంగా ఉన్నాడు. ఇది చూసిన ఆ యజమాని ఆగ్రహంతో ఉద్యోగిపై తీవ్రంగా దాడి చేయగా.. అతడు మరణించాడు. బెంగళూరులోని యలహంకలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఆనంద్ రాజ్‌కు బెంగళూరులో ఓ చిన్న ఫ్యాక్టరీ ఉంది. అందులో కేరళం రాష్ట్రానికి చెందిన కిరణ్ ఉద్యోగిగా గత రెండేళ్ల నుంచీ పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆనంద్ కుమార్తెతో కిరణ్ సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయంలో యజమాని ఆనంద్ అసంతృప్తిగా ఉన్నాడు.
గత సోమవారం తాను తమిళనాడుకు వెళ్తున్నాని కుటుంబ సభ్యులతో ఆనంద్ అబద్ధం చెప్పి బయలుదేరాడు. కొంత సమయం గడిచాక మళ్లీ ఇంటికి వెళ్లాడు. అప్పుడే కుమార్తె గదిలో కిరణ్ ఉన్నట్టు గుర్తించాడు. దీంతో ఆనంద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కుమార్తెను బంధువుల ఇంటికి పంపించి.. కిరణ్‌ను నిర్బంధించాడు. ఆపై అతణ్ని తీవ్రంగా హింసించాడు. క్రికెట్ బ్యాట్‌తో రాత్రంతా విచక్షణారహితంగా దాడి చేశాడు. పొత్తికడుపుపై తన్నడంతో కిరణ్ కుప్పకూలిపోయాడు. వెంటనే కిరణ్‌ను ఆనంద్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఆనంద్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలూ చదవండి
మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం
సీపీఆర్ ఎందుకు చేయలేదు? ఢిల్లీ చిన్నారి మరణంపై తల్లిదండ్రుల ప్రశ్న