Share News

ఎయిర్ గన్‌తో కాల్పులకు తెగబడిన టెకీ.. సెక్యూరిటీ సిబ్బంది, వాహనాలపై పెల్లెట్ల వర్షం..

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:58 PM

బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఎయిర్‌ గన్‌తో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాడు. పలు వాహనాలు, సెక్యూరిటీ గార్డులపై పెల్లెట్ల వర్షం కురిపించడంతో టెకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎయిర్ గన్‌తో కాల్పులకు తెగబడిన టెకీ.. సెక్యూరిటీ సిబ్బంది, వాహనాలపై పెల్లెట్ల వర్షం..
Bengaluru Techie Arrested

కర్ణాటక: బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఎయిర్‌ గన్‌తో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాడు. పలు వాహనాలు, సెక్యూరిటీ గార్డులపై పెల్లెట్ల వర్షం కురిపించడంతో టెకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో నిందితుడు చేసిన ఈ పని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


అనేకల్ శివారు బందాపూర్‌లోని సిపానీ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనురాగ్ తివారీ (40) గత ఎనిమిది నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. అతడి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం మద్యం మత్తులో తివారీ రెచ్చిపోయాడు. తోటి అపార్ట్‌మెంట్ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. తొలుత ఫోన్‌ మాట్లాడిన అతను.. గట్టిగట్టిగా కేకలు వేస్తూ అతవలి వ్యక్తిపై కోపగించాడు. అనంతరం బాల్కనీలోకి వెళ్లి ఎయిర్‌ గన్‌తో బీభత్సం సృష్టించాడు. పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్లపై పెల్లెట్ల వర్షం కురిపించాడు. కాల్పుల శబ్దం విన్న అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అతడిని ఆపే ప్రయత్నం చేయగా.. వారిపైనా తివారీ కాల్పులకు తెగబడ్డాడు.


భయాందోళనలకు గురైన సెక్యూరిటీ సిబ్బంది, అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే సూర్యనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే వరకు దాదాపు 45 నిమిషాల పాటు తివారీ కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడు తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఎయిర్‌ గన్ సహా పెల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తివారీ కాల్పులకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లా నేనూ బాధితుడినే.. కోర్టు తీర్పు అనంతరం తరుణ్ తేజ్‌పాల్

విడాకులిచ్చే అధికారం మతపరమైన సంస్థలకు లేదు.. తేల్చి చెప్పిన మధ్యప్రదేశ్ హైకోర్టు..

Updated Date - Aug 06 , 2026 | 06:16 PM