40 ఏళ్ల క్రితం నీరజా భానోత్.. నేడు స్మిత్ మచ్చార్.. సేమ్ సీన్ రిపీట్.. కానీ..
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:31 AM
స్మిత్ మచ్చార్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. 31 వేల అడుగుల ఎత్తులో నడుస్తున్న విమానంలో దుండగుడితో వీరోచితంగా పోరాడిన మచ్చార్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా తదితర దేశాల అధినేతలు కూడా ఆయన ధైర్యసాహసాలను కొనియాడారు.
ఇంటర్‌నెట్ డెస్క్: స్మిత్ మచ్చార్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. 31 వేల అడుగుల ఎత్తులో నడుస్తున్న విమానంలో దుండగుడితో వీరోచితంగా పోరాడిన మచ్చార్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా తదితర దేశాల అధినేతలు కూడా ఆయన ధైర్యసాహసాలను కొనియాడారు. కాగా.. మచ్చార్‌లాగే 40 ఏళ్ల క్రితం నీరజా భానోత్ కూడా ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. అయితే, దుండగుడి దాడి నుంచి మచ్చార్ ప్రాణాలతో బయటపడగా.. నీరజ మాత్రం టెర్రరిస్టుల కాల్పుల్లో అమరులయ్యారు. ఆ యోధురాలి గురించి తెలుసుకుందాం.
నాడు ఏం జరిగిందంటే..
అది 1986 సెప్టెంబర్ 5. అమెరికా ఎయిర్‌లైన్స్ ప్యాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 747 విమానం (ప్యాన్ యామ్ ఫ్లైట్ 73) ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, న్యూయార్క్‌కు బయల్దేరింది. విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆ టైంలో నలుగురు టెర్రరిస్టులు.. నకిలీ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాహనం ద్వారా ఆయుధాలతో విమానంలోకి ప్రవేశించారు. నాడు సీనియర్ ఫ్లైట్ అటెండెంట్‌గా ఉన్న నీరజ.. టెర్రరిస్టులు చొరబడిన విషయాన్ని గమనించి, వెంటనే కాక్‌పిట్‌లోని పైలట్లకు కోడ్ భాషలో సమాచారం పంపారు. దీంతో పైలట్లు కాక్‌పిట్ నుంచి రీల్ కేబుల్స్ సాయంతో (సాధారణంగా బోయింగ్ 747 విమానంలో రీల్ కేబుల్స్ అమర్చబడి ఉంటాయి) రన్‌వేపై దిగారు. టెర్రరిస్టులు అమెరికన్ల పాస్ పోర్టు ఇవ్వాలని అటెండెంట్లను భయపెట్టారు. అప్పుడు విమానంలో మొత్తం 379 మంది ఉన్నారు. కానీ, నీరజ నేతృత్వంలోని టీం సభ్యులు 43 మంది అమెరికా ప్రయాణికుల పాస్‌పోర్టులను రహస్యంగా సేకరించారు. కొన్నింటిని సీట్ల కింద దాచారు. మరికొన్ని పాస్‌పోర్టులను టాయిలెట్‌లో ఫ్లష్ చేశారు. అలా అమెరికన్ల గుర్తింపు బయటకు రాకుండా చూశారు. ఇలా మొత్తం 16 నుంచి 17 గంటలు గడిచిపోయాయి. అప్పటికే విమానంలోని పవర్ యూనిట్, బ్యాకప్ బ్యాటరీలు డ్రెయిన్ అయిపోయాయి.
రంగంలోకి పాక్ మిలిటరీ
బయట ఉన్న పాక్ మిలిటరీ రంగంలోకి దిగింది. విమానాన్ని చుట్టు ముట్టింది. దీంతో టెర్రరిస్టులు ప్రయాణికులపై విచ్చలవిడిగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. నీరజ, ఆమె టీం సభ్యులు ఎమర్జెన్సీ తలుపులను తెరిచి ప్రయాణికులకు రక్షణగా నిలిచారు. టెర్రరిస్టుల బులెట్లు ప్రయాణికులకు తగలకుండా నీరజ అడ్డుపడ్డారు. అంతేకాకుండా ముగ్గురు పిల్లలకు ఆమె కవచంగా మారి వారి ప్రాణాలను రక్షించారు. టెర్రరిస్టుల తుపాకుల బులెట్లు దూసుకుపోవడంతో ఆమె తన ప్రాణాలను కోల్పోయారు. అప్పటికే పాక్ మిలిటరీ.. విమానంలోకి ప్రవేశించి టెర్రరిస్టులను పట్టుకుంది. విమానంలో ఉన్న మొత్తం 379 మంది ప్రయాణికుల్లో 359 మందిని విమాన సిబ్బంది కాపాడారు. వారిలో నీరజ అమరులయ్యారు. తర్వాతి 1987లో భారత ప్రభుత్వం నీరజకు అశోక చక్ర (మరణానంతరం) అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళగా, అత్యంత పిన్న వయస్కురాలిగా నీరజ గుర్తింపు పొందారు. అలాగే, నీరజ అనే పేరుతో 2016లో సినిమా కూడా విడుదలైంది. కాగా.. మరో రెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 7న నీరజ 24వ పుట్టినరోజు ఉంది. తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందే ఆమె అమరులయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యాపై ఉక్రెయిన్ ‘జాంబీ కార్ల’ యుద్ధం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి