Share News

ఆపరేషన్ తర్వాత మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్‌ వైప్స్‌.. మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యం..

ABN , Publish Date - Aug 20 , 2026 | 09:17 AM

ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన 19 ఏళ్ల మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఆపరేషన్‌ చేసిన తర్వాత ఆమె కడుపులోనే గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్ వదిలేసి కుట్టేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది.

ఆపరేషన్ తర్వాత మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్‌ వైప్స్‌.. మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యం..
Beed medical negligenc

ఇంటర్నెట్ డెస్క్: ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన 19 ఏళ్ల మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఆపరేషన్‌ చేసిన తర్వాత ఆమె కడుపులోనే గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్ వదిలేసి కుట్టేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. తీవ్ర కడుపునొప్పి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది (Beed medical negligence).


వడ్వాణి గ్రామానికి చెందిన సంధ్య ఆగస్టు 1న ప్రసవం కోసం బీడ్‌ జిల్లా ఆస్పత్రిలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమెకు ఆపరేషన్‌ చేశారు. నాలుగు రోజుల తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన కొద్దిరోజులకే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. మహిళ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన స్కానింగ్‌లో ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు (Maharashtra C-section negligence).


పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పుణెలోని సాసూన్‌ ఆస్పత్రికి తరలించారు (Beed hospital negligence). అక్కడ వైద్యులు మరోసారి శస్త్రచికిత్స నిర్వహించి, ఆమె కడుపులో ఉన్న గ్లౌజులు, పేపర్‌ వైప్స్‌ ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారు. తన భార్య పరిస్థితికి మొదటి ఆపరేషన్‌లో జరిగిన నిర్లక్ష్యమే కారణమని సంధ్య భర్త సూరజ్‌ గైక్వాడ్‌ ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Updated Date - Aug 20 , 2026 | 09:20 AM