Share News

లా కోర్సులకు వయోపరిమితి తొలగింపు

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:36 AM

న్యాయ విద్య అభ్యసించాలనుకునే వారికి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తీపికబురు అందించింది

లా కోర్సులకు వయోపరిమితి తొలగింపు
law couses

సుప్రీంకోర్టుకు తెలిపిన బార్‌ కౌన్సిల్‌

న్యూఢిల్లీ, నవంబరు 6: న్యాయ విద్య అభ్యసించాలనుకునే వారికి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తీపికబురు అందించింది. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో విధించిన గరిష్ఠ వయోపరిమితిని ఎత్తివేసింది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఈ విషయాన్ని బీసీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. గతంలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 20 ఏళ్లు, మూడేళ్ల కోర్సుకు 45 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని బీసీఐ నిర్దేశించింది. దీనిని సవాల్‌ చేస్తూ రిషబ్‌ దుగ్గల్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వయోపరిమితి అమలుపై 2017లో సుప్రీంకోర్టు స్టే విధించింది. తాజాగా బీసీఐ జనరల్‌ కౌన్సిల్‌ వయోపరిమితిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ తరఫు న్యాయవాది రాధికా గౌతమ్‌ ధర్మాసనానికి తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు పిటిషన్‌పై విచారణ ముగించింది.

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 03:37 AM