Share News

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ABN , Publish Date - Nov 06 , 2026 | 10:10 PM

శాటిలైట్‌ల కంటికి చిక్కకుండా జరగుతున్న పంట వ్యర్థాల దహనాన్ని గుర్తించేందుకు ఐఫారెస్ట్ సంస్థ ఫైర్ వాచ్ వేదికను ఆవిష్కరించింది.

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్
Crop residue burning

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా శాటిలైట్ల నిఘాకు చిక్కకుండా ఏర్పాట్లు చేసిన డా.ఏపీజే అబ్దుల్ కలాం పోఖ్రాన్ అణుపరీక్ష నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాడు కలాం ఉపయోగించిన టెక్నీక్‌ను ఉత్తరాదిన కొందరు రైతులు ఫాలో అవుతున్నారు. ఉపగ్రహాల సెన్సార్లకు చిక్కకుండా పంటవ్యర్థాలను దహనం చేస్తూ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఓ భూభాగం మీదుగా వెళుతున్నప్పుడు మాత్రమే శాటిలైట్లు కింద ఉన్న దృశ్యాలను చిత్రీకరించగలవని అర్థం చేసుకున్న కొందరు అందుకు అనుగుణంగా పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. శాటిలైట్ గమనం నిర్దిష్ట సమయానుసారం ఉంటుంది. కాబట్టి తమ భూభాగం మీదుగా శాటిలైట్ ఏ సమయాల్లో వెళుతుందో తెలుసుకుంటుని, అవి గాక మిగతా సమయాల్లో తమ పని కానిచ్చేస్తున్నారు.


ప్రస్తుతం పంటవ్యర్థాల దహనంతో చెలరేగే మంటలను పోలార్ క్షక్ష్యలోని నాలుగు శాటిలైట్ల ద్వారా గుర్తిస్తున్నారు. పగటి వేళ నిర్దిష్ఠ సమయాల్లో అవి గంగా, సింధు నదీ పరీవాహక ప్రాంతాల మీదుగా వెళుతూ కింద కనిపించే అగ్నికీలలను గుర్తిస్తున్నాయి. మిగిలిన సమయాల్లో కూడా ఈ మంటలను గుర్తించే విధంగా ఫైర్ వాచ్ వేదికను ఐఫోరెస్ట్ సంస్థ ఆవిష్కరించింది. ఈ వేదిక ద్వారా అటు పోలార్ శాటిలైట్ల డేటా, ఇటు జియోస్టేషనరీ కక్ష్యలోని శాటిలైట్ల డేటాను అనుసంధానించి పంటవ్యర్థాల దహనం ఎంత విస్తీర్ణంలో జరిగిందో తెలుసుకుంటారు.

వాస్తవానికి ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి గతంలో సిఫారసు చేసింది. జియోస్టేషనరీ కక్ష్యలోని శాటిలైట్ల సాయంతో నిరంతరం పంటవ్యర్థాల దహనంపై ఓ కన్నేసి ఉంచే అంశాన్ని పరిశీలించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు సూచించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు

Updated Date - Nov 06 , 2026 | 10:23 PM