Share News

భారతీయులకు వీసా సర్వీసులను పునరుద్ధరించిన బంగ్లాదేశ్

ABN , Publish Date - Feb 20 , 2026 | 06:51 PM

ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్ రెహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ శుక్రవారంనాడు పునరుద్ధరించింది.

భారతీయులకు వీసా సర్వీసులను పునరుద్ధరించిన బంగ్లాదేశ్
Bangladesh restores Visa servises in New Delhi

న్యూఢిల్లీ: ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్ రెహ్మన్ (Tari1ue Rehman) సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ శుక్రవారంనాడు పునరుద్ధరించింది. దీంతో రెండు నెలులుగా నిలిచిపోయిన వీసా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బీఎన్‌పీ నేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.


బంగ్లాదేశ్‌లోని అన్ని వీసా సర్వీసులను త్వరలోనే పునరుద్ధరిస్తున్నట్టు సీనియర్ ఇండియన్ కాన్సులర్ అధికారి న్యూఢిల్లీలో గురువారంనాడు ప్రకటించారు. ఈ క్రమంలో భారతీయ పౌరులకు వీసా సర్వీసులను ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ శుక్రవారంనాడు పునరుద్ధరించింది.


కొద్దికాలం క్రితం భారత వ్యతిరేక యువనేత షరీఫ్ ఒస్మాన్ హదీ హత్యకు గురికావడం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హదీ హత్యానంతరం హిందూ మైనారిటీలపై దాడులు, హత్యాకాండలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. గత డిసెంబర్‌ నుంచి భారత్-బంగ్లా మధ్య వీసా సర్వీసులు నిలిచిపోయాయి. అయితే యూనస్ తాత్కాలిక ప్రభుత్వం తప్పుకోవడం, ప్రజాస్వామ్యబద్ధంగా తారిఖ్ రెహ్మాన్ ఎన్నికకావడంతో భారత్-బంగ్లా మధ్య సంబంధాల పునరుద్ధరణకు సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

బెంగాల్ ఎస్ఐఆర్‌పై సుప్రీం సంచలన ఆదేశాలు.. న్యాయాధికారుల నియామకానికి ఆదేశం

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం.. సిగ్గుచేటని బీజేపీ ఆగ్రహం

Updated Date - Feb 20 , 2026 | 06:54 PM