శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్
ABN , Publish Date - Jul 06 , 2026 | 08:00 PM
అయోధ్య విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన చంపత్‌రాయ్‌తోపాటు అనిల్ మిశ్రా రాజీనామాలను ట్రస్టు ఆమోదించింది.
లక్నో, జులై 06: అయోధ్య విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన చంపత్‌రాయ్‌తోపాటు అనిల్ మిశ్రా రాజీనామాలను ట్రస్టు ఆమోదించింది. సోమవారం అయోధ్యలో రామమందిర్ ట్రస్టు సమావేశమైంది. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి వెల్లడించారు.
జులై 22న మరోసారి సమావేశం కావాలని ట్రస్టు నిర్ణయించినట్లు గోవింద్ గిరి వివరించారు. సిట్ నివేదికను ట్రస్ట్ పరిశీలించనుంది. అలాగే విరాళాల చోరీ కేసులో నిందితులను తక్షణమే పట్టుకొని, శిక్షించాలని ప్రభుత్వాన్ని ట్రస్టు కోరింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని రామమందిర్‌పై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు స్పష్టం చేసింది.
చంపత్‌రాయ్ సేవలను గోవింద్ గిరి అభినందించారు. తన దృష్టిలో ఆయన నిష్కళంకుడని పేర్కొన్నారు. ఆలయ ఉద్యమం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. అయోధ్యను కించపరిచే ప్రచారాన్ని నమ్మవద్దనని తెలిపారు. అయితే ఈ చోరీ కేసులో దోషులను పట్టుకునే వరకు తాను ట్రస్టులో కొనసాగలేనని చంపత్ రాయ్ స్పష్టం చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్
నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్
For More National News And Telugu News