అసోంలో యుద్ధ విమానం సుఖోయ్ గల్లంతు
ABN , Publish Date - Mar 05 , 2026 | 09:39 PM
అసోంలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 MKI (Su-30 MKI) యుద్ధ విమానం గల్లంతయింది. గురువారం సాయంత్రం కార్బీ ఆంగ్లాండ్‌లోని చోకిహోలా సమీపంలోకి రాగానే రాడార్‌తో ఈ యుద్ద విమానానికి సంబంధాలు తెగిపోయాయి.
దిస్‌పూర్, మార్చి 05: అసోంలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 MKI (Su-30 MKI) యుద్ధ విమానం గల్లంతయింది. గురువారం సాయంత్రం కార్బీ ఆంగ్లాండ్‌లోని చోకిహోలా సమీపంలోకి రాగానే రాడార్‌తో ఈ యుద్ద విమానానికి సంబంధాలు తెగిపోయాయి. సుఖోయ్ కోసం ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.
ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. శిక్షణలో ఉన్న ఈ యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా కుప్పకూలినట్లు ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఈ ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. ఈ యుద్ధ విమానం కోసం ఎయిర్ ఫోర్స్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ముగిసిన కడియం విచారణ.. దానం విచారణ వాయిదా
ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ
For More National News And Telugu News