ముగిసిన కడియం విచారణ.. దానం విచారణ వాయిదా
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:54 PM
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్ విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తి కాలేదు.
హైదరాబాద్, మార్చి 05: తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ గురువారం సాయంత్రం ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆయన విచారణను శనివారానికి అంటే.. మార్చి 7వ తేదీకి స్పీకర్ వాయిదా వేశారు. ఈ కేసులో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరు వర్గాల వారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు.
దీంతో ఈ దానం నాగేందర్ పిటిషన్‌ను తెలంగాణ స్పీకర్ శనివారం విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురి ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తయింది. వారందరికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చీట్ ఇచ్చిన విషయం విదితమే. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను విచారించాల్సి ఉంది. ఆయన విచారణ కూడా పూర్తయితే.. ఈ ఫిరాయింపుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు: ఏజీ
ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ
For More TG News And Telugu News