Share News

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర: లెఫ్టినెంట్ గవర్నర్

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:18 PM

అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు చేపట్టే యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఆగస్టు 28వ తేదీన ఈ యాత్ర ముగుస్తుందన్నారు.

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర: లెఫ్టినెంట్ గవర్నర్

శ్రీనగర్, ఏప్రిల్12: అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు చేపట్టే యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఆగస్టు 28వ తేదీన ఈ యాత్ర ముగుస్తుందన్నారు. మొత్తం 57 రోజుల పాటు ఈ అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఆదివారం జమ్మూలోని లోక్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విలేకర్లతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 15వ తేదీ ఆ యాత్రలో పాల్గొనేవారు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.


అమర్‌నాథ్ బోర్డు నిబంధనల ప్రకారం 13 లోపు.. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని ఈ యాత్రకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ బ్యాంకు, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే కన్నుమూత

మహిళా బిల్లు మద్దతు కోసం పలు కార్యక్రమాలు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

For More National News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 01:27 PM