Share News

రాహుల్ ఇండియన్ స్టేట్ వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు నిరాకరణ

ABN , Publish Date - May 01 , 2026 | 04:05 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. 2025లో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది.

రాహుల్ ఇండియన్ స్టేట్ వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు నిరాకరణ
Rahul Gandhi

ప్రయాగ్‌రాజ్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. 2025లో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది.


రాహుల్ గాంధీ 2025లో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ఇది కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో పోరాటం అనుకోవద్దని, ఇప్పుడు మనం నేరుగా భారత ప్రభుత్వ వ్యవస్థలతోనే (ఇండియన్ స్టేట్) తలపడుతున్నామని పేర్కొన్నారు. రాహుల్ చేసిన 'ఇండియన్ స్టేట్' వ్యాఖ్యలు జాతీయ సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నందున ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిమ్రాన్ గుప్తా అనే పిటిషనర్ సంభాల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఆదేశాలను సిమ్రాన్ గుప్తా అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను గాయపరచడమే కాకుండా, దేశాన్ని అస్థిరపరచే ఉద్దేశంతో ఉన్నాయని, ఇది దేశద్రేహం కిందకు వస్తుందని పిటిషనర్ వాదించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ డి చౌహాన్ ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు.


ఇవి కూడా చదవండి..

పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 01 , 2026 | 04:12 PM