Home » Allahabad High Court
తన 4వ వైవాహిక వివాదం పరిష్కరించుకునేందుకు సమయం కోరిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్ధనను అలహాబాద్ కోర్టు అంగీకరించింది. ఈలోపు నెలకు రూ.30 వేల చొప్పున ఆమె భరణం ఇవ్వాలని స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ 2024లో అమెరికాలో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు ఇది. భారతదేశంలో సిక్కులు స్వేచ్ఛగా తమ విశ్వాసాలను పాటించలేకున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉన్నట్టు కనిపిస్తోందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది.
లోక్‌సభలో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానానికి కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. తీర్మానంపై ఎంపీలు సంతకం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే..
రాహుల్ గాంధీ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైనికులు భారత సైనికులను కొట్టారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత బలగాలను కించపరచేలా ఉన్నాయంటూ రిటైర్డ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డెరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ పరువునష్టం కేసు వేశారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. దీనిని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించనప్పటికీ కొలీజియం సిఫారసును మార్చి 28న కేంద్ర ఆమోదించింది.
హైకోర్టు రిజిస్టర్ జనరల్ రాజీవ్ భారతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ బదిలీలను ప్రకటించారు. బదిలీ అయిన న్యాయమూర్తుల్లో 236 మంది అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిలు, 207 మంది సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలు, 139 మంది జూనియర్ సివిల్ జడ్జిలు ఉన్నారు.
బాలికపై అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువత్తాయి. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. నేడు (బుధవారం) దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు అమానవీయం అన్నది. అంతేకాక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
జస్టిస్ వర్మ తిరిగి ప్రజావిశ్వాసం పొందాలంటే మొత్తం వ్యవహారంపై స్ర్కూటినీ జరగాలని, ఆయనపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదుకు, సిబీఐ, ఈడీ, ఇతర ఏజెన్సీలతో దర్యాప్తునకు సీజేఐ అనుమతించాలని అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
నచ్చిన పద్ధతిలో వివాహం చేసుకునే హక్కు మేజర్కు ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టమైన వారితో కలిసి ఉండే హక్కు కూడా ఉందని, ఇందుకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని తెలిపింది.