Share News

MP Nadvi Maintenance Order: మీ 4వ భార్యకు నెలకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సిందే.. ఎంపీకి తేల్చి చెప్పిన హైకోర్టు

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:40 PM

తన 4వ వైవాహిక వివాదం పరిష్కరించుకునేందుకు సమయం కోరిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్ధనను అలహాబాద్ కోర్టు అంగీకరించింది. ఈలోపు నెలకు రూ.30 వేల చొప్పున ఆమె భరణం ఇవ్వాలని స్పష్టం చేసింది.

MP Nadvi Maintenance Order: మీ 4వ భార్యకు నెలకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సిందే.. ఎంపీకి తేల్చి చెప్పిన హైకోర్టు
Mohibbullah Nadvi Maintenance Order

ఇంటర్నెట్ డెస్క్: తన 4వ భార్యకు నెల నెలా భరణం చెల్లించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత మొహీబుల్లా నద్వీని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. వివాదాన్ని సామారస్యంగా పరిష్కరించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్న ఎంపీ అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది (Mohibbullah Nadvi maintenance order).

తన నాలుగో భార్యతో గల వైవాహిక వివాదానికి (Marital Dispute) సంబంధించి ఓ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నద్వీ (Allahabad High Court) హైకోర్టును ఆశ్రయించారు. సామరస్య పూర్వకంగా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం కేసును మీడియేషన్ సెంటర్‌కు బదిలీ చేసింది.


వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించే అవకాశం కనిపిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇందుకు ఎంపీకి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈలోపు రూ.55 వేల డిపాజిట్‌ను సమర్పించాలని నద్వీని ఆదేశించింది. ఈ డిపాజిట్‌లో రూ.30 వేలు భరణం కింద భార్యకు జారీ అవుతుందని పేర్కొంది. ఈ డిపాజిట్ చెల్లించకపోయినా, ఆ తరువాత నెల నెలా భరణం సమయానికి చెల్లించడంలో విఫలమైనా మధ్యంతర ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దయిపోతాయని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి:

మోదీకి ట్రంప్‌ అంటే భయం.. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత ప్రకటనపై రాహుల్ గాంధీ

భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 09:25 PM