Share News

5 పోరాట క్షేత్రాలు..823 సీట్లు: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 03 , 2026 | 08:22 PM

అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితప్రాంత పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 వరకూ మొత్తం 823 సీట్లలో పోలింగ్ జరుగగా, కీలకమైన ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డైన్ మొదలైంది.

5 పోరాట క్షేత్రాలు..823 సీట్లు: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
Assembly elctins Counting Day

న్యూఢిల్లీ: అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 వరకూ మొత్తం 823 సీట్లలో పోలింగ్ జరుగగా, కీలకమైన ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డైన్ మొదలైంది. మే 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండటంతో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఎవరు అధికారాన్ని చేపట్టనున్నారనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది.


తమిళనాడులో తిరిగి అధికారాన్ని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆశిస్తుండగా, అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ, కేరళలో పినరయి విజయన్ తిరిగి ఆధికారంలోకి వస్తామని చెబుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, బీజేపీలు ఎవరికి వారే అన్నట్టుగా గెలుపుపై ధీమాతో ఉన్నాయి.


ఎగ్జిట్ పోల్స్‌ను అవలోకిస్తే..

బెంగాల్‌లో..

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ టీఎంసీకి ఈసారి గట్టిదెబ్బ తగలనుందని, బీజేపీని విజయం వరించనుందని ఒకట్రెండు వినహా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలను మమతాబెనర్జీ తోసిపుచ్చారు. 200కు పైగా సీట్లతో తాము నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

కేరళలో..

కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్స్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 140 సీట్లలో యూడీఎఫ్ 78-90 సీట్లు గెలుచుకుంటుందని 'యాక్సిస్ మై ఇండియా' ఎగ్జిట్ పోల్ అంచనా వేయగా, యూడీఫ్‌కు 94కు పైగా సీట్లు వస్తాయని 'సి-ఓటర్' పోల్ తెలిపింది.

అస్సాంలో..

హిమంత్ బిశ్వ శర్మ సారథ్యంలోని బీజేపీ ముడోసారి అధికారంలోకి రావడం తథ్యమని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఢంకా బజాయించాయి. ఎన్డీయే 88-100 సీట్లతో క్లీన్ స్వీప్ సాధిస్తుందని 'యాక్సిస్ మై ఇండియా' అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 85-90 సీట్లు వస్తాయని 'మ్యాట్రిజ్ పోల్' సర్వే తేల్చింది.

తమిళనాడులో...

ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే నాలుగోసారి అధికారంలోకి రానుందని దాదాపు అన్ని పోల్ సర్వేలు చెప్పాయి. అయితే విజయ్ టీవీకే పార్టీకి అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని కూడా అంచనా వేశాయి. టీవీకే 98-120 సీట్లు గెలుచుకుంటుందని, డీఎంకే కూటమి 92-120 సీట్లు, అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే 22-32 సీట్లు సాధిస్తాయని 'యాక్సిస్ మై ఇండియా' అంచనా వేసింది.

పాండిచ్చేరిలో..

కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఎన్డీయే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని పోల్‌స్టర్స్ అంచనా వేశారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో 15-19 సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని 'పీపుల్స్ పల్స్' అంచనా వేసింది.


ఇవి కూడా చదవండి..

ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

Updated Date - May 03 , 2026 | 09:27 PM