Road Accident: అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు..
ABN , Publish Date - Jan 20 , 2026 | 07:35 AM
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వాహనానికి సోమవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ముంబైలో తన భార్య ట్వింకిల్ ఖన్నాతో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), ట్వింకిల్ ఖన్నా దంపతులు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ జంట విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ముంబై(Mumbai) జూహులోని ముక్తేశ్వర్ రోడ్ సమీపానికి వారు రాగానే వేగంగా వచ్చిన ఒక మెర్సిడెస్ కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఆ వేగానికి ఆటో అదుపుతప్పి అక్షయ్ కుమార్ భద్రతా సిబ్బంది(Escort Vehicle) ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీ కొట్టింది.
ఆ ఇన్నోవా వాహనం అక్షయ్ కుమార్ దంపతులు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీను ఢీకొట్టింది. ఇలా ఒకదానికి మరొకటి వాహనాలు ఢీకొన్నాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అక్షయ్ కుమార్ తన వాహనం దిగి, ఆటో(Auto)లో చిక్కుకుపోయిన డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడిని బయటకు తీయడంలో తన సిబ్బందితో కలిసి సాయం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తమ 25వ వివాహ వార్షికోత్సవం (Wedding anniversary) జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అక్షయ్ దంపతులకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిని 30 సెకెన్లలో కనిపెట్టండి..