రిస్ట్ వాచ్ ఆధారంగా అజిత్ మృతదేహం గుర్తింపు
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:14 PM
విమాన ప్రమాద ఘటనా స్థలంలో లభ్యమైన శరీర భాగాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే అజిత్ పవార్ చేతికున్న వాచ్ ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించి బయటకు లాగారు.
పుణె: మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం క్రాష్ అయిన వెంటనే ముక్కలై పెద్దత్తున మంటలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. వారి మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేనంతగా మారాయి. ఘటనా స్థలంలో లభ్యమైన శరీర భాగాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే అజిత్ పవార్ చేతికున్న వాచ్ (Wristwatch) ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించి బయటకు లాగారు. అయితే అప్పటికే నష్టం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అజిత్ పార్టీ ఎన్‌సీపీ అధికారిక గుర్తు కూడా క్లాక్ (గడియారం) కావడం యాదృచ్ఛికం.
రేపు అంత్యక్రియలు
అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో 8 సార్లు బారామతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కన్నుమూయడం నియోజకవర్గ ప్రజలను శోకసంద్రంలో ముంచింది. ఆయన మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. బారామతిలోనే అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారంనాడు జరుగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కీలక విషయాలను వెల్లడించిన DGCA
విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో..
For More National News And Telugu News